Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

2024లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి ఖాయం.

0

2024లో జరిగే  సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగురవేయడం ఖాయమని బద్వేలు  తెలుగుదేశం పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు గుర్రంపాటి వెంగళరెడ్డి సీనియర్ నాయకుడు బైసాని రవి శంకర్ రెడ్డి  ధీమా వ్యక్తపరిచారు.   గతంలో జరిగిన ఎన్నికలు వేరు జరగబోయే ఎన్నికలు వేరు అని ఆయన తెలిపారు వైకాపా నాలుగు సంవత్సరాల పాలనపై ప్రజలు అన్ని విధాలుగా విసుగెత్తి పోయారని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను ముఖ్యమంత్రి అన్ని విధాల బురిడి కొట్టించినట్లు ఆయన ఆరోపించారు.

 

సంక్షేమ పథకాలు కేవలం కొద్ది మందికి మాత్రమే అందుతున్నాయి తప్ప అర్హులైన వారికి పూర్తిస్థాయిలో అందడంలేదని ఆయన ఆరోపించా.రు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాష్ట్రంలోని అన్న క్యాంటీన్లు మూసి వేయించి పేదల ఉసురు పోసుకున్నట్లు ఆరోపించారు. నిరుద్యోగులకు బృతి విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని ముఖ్యమంత్రి గండి కొట్టిన విషయాన్ని వారు గుర్తు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేదని చెప్పారు కుల మతాలకతీతంగా ప్రతి పండగకు ఉచితంగా నిత్యవసర వస్తువులు పంపిణీ చేసే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 

గత నాలుగు సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి ఈ పథకాలు ఎత్తివేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. రైతులను జగన్ ప్రభుత్వం అన్ని విధాల మోసం చేస్తున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తామని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పడం రైతుల ఆగ్రహానికి కారణమైందన్నారు. పేరుకే రైతుల సంక్షేమం అని చెబుతున్న ముఖ్యమంత్రి రైతులపై ఏమాత్రం శ్రద్ధ కన పరచడం లేదని అరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాములో ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉండే వారిని కక్షలు కార్పన్యాలు ప్రజల మధ్య ఉండేవి కావన్నారు.

 

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్ష నేతలపై అనేక కేసులు బనాయించి వారిని జైలు పాలు చేయడమే గాక మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో చదువుకుంటున్న బాలికలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కళాశాలలకు వెళ్లిన బాలికలు నడిరోడ్డుపై దారుణ హత్యలకు గురవుతున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు  ఉదాహరించారు. నేరాలు అరికట్టే విషయంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు  ఆరోపించారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్లు వారు ఆరోపించారు.

ఎంతటి వారైనా సిబిఐ ముందు సమానులే.

అనేక విషయాలలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనపై విసిగించింది ఉన్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో తాము ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ బయటికి వచ్చినట్లు తెలిపారు ఎన్నికల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఓట్లు వారి చేతికి వస్తే వైకాపా పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నట్లు  తెలిపారు. బద్వేల్ మున్సిపాలిటీలోని 35 వార్డులలో తెలుగుదేశం పార్టీ ఎంతో బలంగా ఉందని  అలాగే బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో తెలుగుదేశం పార్టీ ఎంతో బలంగా ఉందని వారు  పేర్కొన్నారు అన్ని వార్డులలో పార్టీ నాయకులు క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి వారి మనోభావాలు తెలుసుకున్నట్లు తెలిపారు.

 

బద్వేలు మున్సిపాలిటీలో దాదాపు 53 వేల మంది ఓటర్లు ఉన్నారు 64 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఓటర్లలో దాదాపు 70 శాతం మంది తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ఒక విధంగా చూసుకుంటే బద్వేల్ పట్టణం మొదటినుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది కొన్ని తప్పిదాల వల్ల ఓటర్లు తెలుగుదేశం పార్టీపై అభిమానం ఉన్నప్పటికీ అటు ఇటు వెళ్లారు కానీ ఇప్పుడు పట్టణంలో పూర్తిగా పూర్వ పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి ఆ పార్టీకి పెద్ద ప్లస్ గా మారింది ఒక ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఇదే విషయాన్ని  తెలిపారు ఈసారి జరిగే ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఏ శక్తి కూడా అడ్డుకోలేదని వెంగళరెడ్డి రవిశంకర్ రెడ్డి పూర్తి ధీమా కనపరిచారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie