పోరుమామిళ్లలో 25 కోట్ల రూపాయల ఐ పి.. లబో దిబో మంటున్న బాధితులు.. ఇప్పటికే రెండుసార్లు ఐ పి పెట్టిన మోసగాడు..
బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్లలో.
ఓబులేసు అనే వ్యక్తి 25 కోట్ల రూపాయలు మేరకు ఐపి పెట్టి పరారయ్యాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే ఓబులేసు పండుకో రెండుసార్లు ఐ పి పెట్టినట్లు సమాచారం.
చిట్టిల వ్యాపారం అంటారు .
రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటారు.
నాలుగు కార్లు మనేజ్ చేస్తా వుంటారు. తాము పెద్ద పుడుంగు నంటు బజార్ లో పెద్ద బిల్డ్ అప్ లు ఇస్తారు .
గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు ఈ పిచ్చి జనాలు అలాంటి వారిని నమ్ముతారు.
చట్టం లోని కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకొని ఇలాంటి దగా కోరులు జనం కొంప ముంచుతున్నరు.
ఎం. బల రామి రెడ్డి
ప్రతినిత్యం ప్రతి నిధి పోరుమామిళ్ళ
నమ్మితే ఎంతటి వారినైనా మోసం చేసే దగా కోరులు తయారయ్యారు.
తాను ఏ స్థాయి లో ఉన్నాను తన కెపాసిటీ ఏమిటి . తనకు వెనకాల వున్న ఆస్తి ఎంత అనేది చూడకుండా అక్క, అత్త ,మామ, అన్న అంటూ నేను చిట్టీలు వేసాను .
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను అని జనం వద్ద 25 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ జనానికి కుచ్చు టోపీ పెట్టి భారీ ఐ.పి బాంబ్ పేల్చిన ఓ గరాన మోసగాని చరిత్ర ఇది .
లక్ష్మి శెట్టి చిన్న ఓబులేసు అనే వ్యక్తి గతం లో గిద్దలూరు ఏరియాలో 2 కోట్లకు ఐ. పి పెట్టీ వచ్చాడు. అనంతరం మైదుకూరు చేరి అక్కడ కూడా 3 కోట్లకు ఐ.పి పెట్టాడు. అక్కడ నుంచి పోరుమామిళ్ళ చేరుకొని చిట్టీల వ్యాపారం చేస్తూ అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మొదలు పెట్టి 3 కార్లు, మెడలో తాడు లాంటి చైన్ హంగామా శృష్టించాడు . గతం తెలియని పిచ్చి జనాలు ఈడు ఎంత లావు కోటీశ్వరుడు వీడి వెనకాల ఎంత వుందో అని నమ్మి అతనికి చిట్టీలు వేయడమే కాక లక్షలాది రూపాయలు వడ్డీలకు ఇచ్చారు .
తల్లి ఇద్దరు కుమారులు మిస్సింగ్.
మానవునికి ఆశ చెడ్డది మూడు రూపాయల వడ్డీ అన్నా ఐదు రూపాయల వడ్డీ అన్నా తమ కాడ లేకపోయినా 1.50 వడ్డీకి తెచ్చుకొని ఇలాంటి దగా కోరులకు 5 రూపాయల వడ్డీకి ఇస్తారు. జనం వీక్నెస్ ను పట్టుకొని వారి వద్ద నుంచి దాదాపు 25 కోట్ల రూపాయలు వసూలు చేసుకొని ఈ రోజు ఐ.పి బాంబ్ పేల్చాడు అంటే బాధితులు ఏమై పోవాలి . కొందరు కూతురు పెళ్లి కోసమో, పిల్లల చదువు కోసమో , ఇల్లు కట్టుకోడానికో , ఒక్క సారిగా మాకు ఒక మొత్తంలో డబ్బులు వస్తుంది అన్న ఉద్దేశంతో రూపాయికి రూపాయి కూడ పెట్టుకొని , ఇలాంటి దగా కోరుల చేతిలో పెట్టి రేపు నా కూతురి పెళ్ళి పరిస్థితి ఏమిటి , మా పిల్లల స్కూల్ ఫీస్ ల పరిస్థితి ఏమిటి , నేను కట్టే ఇల్లు మధ్యలో ఆగి పోతే నా పరిస్థితి ఏమిటి అని ఆత్మ హత్యలకు పాల్పడే వాళ్ళు ఎంతో మంది వున్నారు.
ఇలాంటి వారిని కట్టడి చేయడంలో పోలీస్ ల వైఫల్యమా ,చట్టం లోని లోపమా న్యాయ స్థానాల నిర్లక్ష్యమా ? మంది వద్ద వసూలు చేసిన సొమ్మును తన పిల్లలు భార్య అన్న దమ్ముల పేర్లతో ఆస్తులు బాధలయించుకొని ఐ.పి పెడితే సరిపోతుందా. ఈ చిన్న ఓబులేసు ఐ.పి పెట్టేందుకు జగన్నాటక సూత్రధారి ఆయన భార్య , ఆయన అన్న గతం లో మైదుకూరులో , గిద్దలూరులో ఐ.పి పెట్టేందుకు ఆయన భార్య ప్రధాన సూత్రదారి ఎదో తెలుగు సినిమాలో అన్నట్లుగా నాటకం జగన్నాటకం అన్నట్లు ప్రధాన సూత్రదారి ఓబులేసు భార్య ఆయన అన్న వారి ఇరువురిని పోలీసులు ఇంత వరకు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు అంటే .
ఓబులేసు అనే వ్యక్తి ఐ.పి పెట్టకముందే పోలీస్ లకు భారీగా ముడుపులు చెల్లించి వెళ్లినట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ కేసు విషయం లో పోలీస్ లు సరిగ్గా స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. జనం ఎటు పోతే మాకెందుకు మాకు రావాల్సిన ముడుపులు మాకు వచ్చాయి కదా ! అనే ఉద్దేశం తో పోలీస్ లు వున్నట్లు తెలుస్తోంది . ఏది ఏమైనా చట్టం లోని కొన్ని లోటుపాట్లను అడ్డు పెట్టుకొని ఇలాంటి దగా కోరలు రోజు రోజుకు ఇటు పోరుమా మిళ్ల లోను వివిధ పట్టణాలలో చిట్టీల వ్యాపారంతో మొదలు పెట్టి రియల్ ఎస్టేట్ వరకు వెళ్లి ప్రజలకు కుచ్చు టోపీ పెడుతున్నారు .