Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

జపాన్ లో బాహుబలి 2

0

హైదరాబాద్, ఫిబ్రవరి 9: ద‌ర్శకధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ ఆర్ఆర్ ప్రపంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విషయం తెలిసిందే. తెలుగు,త‌మిళం, హిందీ, మ‌లయాళం భాష‌ల్లో విడుద‌లైన ఈ మూవీ ..రూ.1200 కోట్లకు పైగా వసూళ్లతో ఔరా అనిపించింది. అంతేకాదు.. అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ప‌లు అవార్డుల‌ను గెలుచుకుంది. ఈ చిత్రంలోని ‘‘నాటు నాటు’’ పాట‌కు గోల్డెన్ గ్లోబ్-2023 అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరిలో ఈ అవార్డు ద‌క్కింది. అలాగే, తెలుగు నుంచి మొట్ట మొద‌టిసారిగా ఆస్కార్ నామినేష‌న్ రేసులో నిలిచింది. ఈ పాట‌కు కీర‌వాణి బాణీలు స‌మ‌కూర్చగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారు. ప్రేమ్ ర‌క్షిత్ మాస్టర్ పాట‌కు డ్యాన్స్ కంపోజ్ చేశారు. జక్కన్నఆర్ ఆర్ఆర్ సినిమాతోనే కాదు. ‘బాహుబలి’ సినిమాతోనే తానేంటో నిరూపించుకున్నారు. ఇక ఇప్పుడు ఆర్ ఆర్ఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. బాహుబలి సిరీస్‌ను కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. బాహుబ‌లి పార్ట్ 1తో అంత‌ర్జాతీయ ద‌ర్శకుడిగా గుర్తింపు పొందిన‌ జ‌క్కన్న RRRతో మ‌రో మెట్టు ఎక్కారన‌డంలో ఎలాంటి సందేహం లేదు.ఇటీవ‌ల జ‌పాన్‌లో ఆర్ ఆర్ఆర్ కోట్లలో వసూళ్లు సాధించింది. అక్కడ ఈ మూవీ 2022, అక్టోబ‌ర్ 22న విడుద‌లైంది. దిగ్విజ‌యంగా శ‌త దినోత్సవం పూర్తి చేసుకుంది.

మొద‌టివారం మిక్స్‌డ్ టాక్ వినిపించిన‌ప్పటికీ.. రెండో వారం నుంచి ప‌బ్లిక్ టాక్ తో దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే.. ఆర్ ఆర్ఆర్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోడానికి జ‌క్కన్న మరో ప్లాన్ చేస్తున్నారు. ఈసినిమా విజ‌యాన్ని ‘బాహుబ‌లి- 2’ కు ఉపయెగ‌ప‌డేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేశారని తెలుస్తోంది. బాహుబ‌లి-2 ఇదివరకే జపాన్‌లో రిలీజైంది. అక్కడ రూ.18.50 కోట్లు రాబట్టింది. ఈ మొత్తాన్ని మ‌రింత పెంచేలా ప్రమోష‌న్స్ పెంచాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది. అదే జ‌రిగితే.. ఆర్ ఆర్ఆర్ ని దాటి భారీ హిట్‌గా ‘బాహుబ‌లి -2’ నిల‌వ‌డం ఖాయ‌మ‌ని సినీ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఎందుకంటే బాహుబలి-1తో రాజమౌళి తెలుగు ప్రజలనే కాదు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించి అందరి మన్ననలు పొందారు.

రాజమౌళి సినిమా అంటే అభిమానం చూపించేలా తన మార్కును క్రియేట్ చేసుకున్నారు. అది ఆర్ ఆర్ఆర్ తో మరింత నిజమైంది. దీంతో అభిమానులు ‘బాహుబలి 2’ను గనుక రిలీజ్ చేస్తే ‘ఆర్ఆర్ఆర్‌’ తరహాలోనే ఆదరిస్తారనే నమ్మకం చిత్ర యూనిట్ లో ఉంది. కాబట్టి.. ‘బాహుబలి 2’ విజయవంతం అవుతుంది అని అనుకుంటున్నారు. ఇక ఆర్ ఆర్ఆర్ మూవీ మ‌ల్టీస్టార‌ర్ గా తెర‌కెక్కిన విషయం తెలిసిందే. 2022, మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాలో స్టార్ హీరోలు తారక్, రాంచ‌ర‌ణ్ ప్రధాన పాత్రల్లో క‌నిపించ‌గా.. వీరికి జోడిగా హాలీవుడ్ న‌టి ఒలివియా మోర‌స్, బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ న‌టించారు. బాలీవుడ్ యాంగ్రీమ్యాన్ అజ‌య్ దేవ‌గ‌ణ్ ముఖ్య పాత్రలో క‌నిపించారు. ఈ చిత్రాన్ని డీవివి బ్యాన‌ర్‌పై దాన‌య్య చిత్రాన్ని నిర్మిస్తే.. కీర‌వాణీ సంగీతం అందించారు. మరి ఈ సినిమా మాదిరిగా ‘బాహుబలి 2’ను కూడా విడుదల చేయాలనే రాజమౌళి ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie