నంద్యాల
నంద్యాల మున్సిపల్ కార్యాలయం లో ఛైర్ పర్సన్ మహాబున్నిసా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్. మరియు శానిటేషన్ విభాగం అధికారులతో గురువారం నాడు మీటింగ్ ఎర్పాటు చేయడమైనది. ప్లాస్టిక్ వాడడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. కావున తప్ప కుండా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని కోరారు.
అనంతరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్ మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధం విధించాలని సెంటర్ గవర్నమెంట్ పాలసీ అని దీనికి అందరూ సహకరించాలన్నారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ విషయం పై ప్రజలకు అవగాహన కోసం తొందరలో నంద్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో శానిటేషన్ అధికారులు లక్ష్మి నారాయణ. వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. .