కత్తితో విచక్షణారహితంగా దాడి
మైలవరం: మైలవరం మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన గుంజ మాధవి (25) పై భర్త శీను మరియు అత్త సులోచన కలిసి కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసారు.
బాధితురాలు నిద్రిస్తున్న సమయంలో 12 గంటలకు అత్త భర్తలు కలిసి మాధవిని హతమర్చే ప్రయత్నం చేయగా ఇరుగుపొరుగువారు గమనించి వారిని అడ్డుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న మాధవిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త మైలవరం పోలీస్ స్టేషన్ నందు లొంగిపోయినట్లు సమాచారం.