Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

జవహార్ నగర్ లో దారుణం…

0

తాగిన మత్తులో నడి రోడ్డుపై మహిళను వివస్త్రను చేసి…

తాగిన మత్తులో ఉన్న ఓ యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న యువతిపై అందరూ చూస్తుండగానే దాడి చేసి వివ స్త్రను చేశాడు. ఈ దారుణ సంఘటన ఆదివారం రాత్రి మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ యువతి (28) రాత్రి 8.30 గంటల సమయంలో దుకాణం పని మీద రోడ్డుపై నడుచు కుంటూ వెళుతుండగా తాగిన మత్తులో ఉన్న పెద్దమారయ్య(30)అనే యువకుడు దాడి చేశాడు. ఆమెను దారుణంగా కొట్టి అందరూ చూస్తుండగానే ఆమె ఒంటి మీద ఉన్న బట్టలను చింపి వివస్త్రను చేశాడు.

ఈ దారుణాన్ని అడ్డుకోబోయిన మరో మహిళను కూడా ఇతను దాడి చేసి కొట్టాడు. తాగిన మైకంలో ఉన్న మారయ్య రోడ్డుపై అంత హంగామా చేస్తున్నా చూసిన వారు ఈ దారుణాన్ని అడ్డుకోలేక పోయారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో దాడికి గురైన ఆ యువతి 15 నిమిషాల పాటు ఒంటిపై బట్టలు లేకుండానే నిస్సహాయ స్థితిలో రోడ్డుపై ఏడుస్తూ కూర్చుంది.
స్థానికల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాధిత యువతికి రక్షణ కల్పించారు.

పెద్ద ప్లాస్టిక్ కవర్ ను ఆమె ఒంటిపై కప్పి అక్కడి నుంచి ఆమెను ఇంటికి పంపించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కూలీ పని చేసుకునే నిందితుడు మారయ్య తాగిన మత్తులో గతంలో కూడా ఓ మహిళపై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.పోలీసులు ఇతనిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie