- భర్తను చంపిన భార్య
- అక్రమ సంబంధమే కారణం
మేడ్చల్: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఔషపూర్ గ్రామంలో వుంటున్న మౌలాన్, శాంతి కుటుంబం , వృత్తిరీత్యా కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తోంది. శాంతి తన ప్రియుడు బాబు తో అక్రమ సంబంధం పెట్టుకుందని కొన్ని రోజులుగా పలుమార్లు ఇంట్లో గొడవలు జరిగాయి. దాంతో విసిగెత్తిన భార్య శాంతి , తన భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. భర్త తాగే మద్యంలో మందులో విషం కలిపింది. భర్త చనిపోయాడు. ఆ విషయం బయటకు రాకుండా శాంతి తన భర్త కడుపునొప్పితో చనిపోయారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
రంగంలోకి దిగిన పోలీసులు , మృతి చెందిన మౌలాన్ మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ చూసి పోలీసులు నివ్వెరపోయారు. తరువాత విచారణ నిమిత్తం భార్య శాంతిని అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు బయటకు వచ్చాయి. పోలీసులు భార్య శాంతి తన ప్రియుడు బాబును అదుపులోకి తీసుకున్నారు. .తమ అక్రమ సంబంధంకు అడ్డు వస్తున్నాడని అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు బాబు తో కలిసి భర్తను చంపినట్లు శాంతి అంగీకరించింది.