భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు. మంచి వాతావరణమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం నాడు అయన హరితహారం కార్యక్రమంలో భాగంగా మారెడ్ పల్లి లోని పార్క్ లో మొక్కలు నాటానే. తరువాత పద్మారావు నగర్ లోని చిదానందం కాలనీలో దశాబ్ది పార్క్ ను ప్రారంభించారు
మంత్రి మాట్లాడుతూ ఈ ఒక్క రోజే నగరంలో 60 దశాబ్ది పార్క్ ల ప్రారంభం అయ్యాయి. పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటాలి. ముఖ్యమంత్రి ప్రత్యేక పర్యవేక్షణ, కృషితో చేపట్టిన హరితహారం తో రాష్ట్రంలో పచ్చదనం పెరిగింది. పల్లె ప్రకృతి వనాలు, పట్టణాలలో పార్క్ ల నిర్మాణం, రహదారుల వెంట మొక్కల పెంపకం చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు మొక్కలను నాటి పరిరక్షించాలని మంత్రి అన్నారు.