తెలంగాణలో ఎన్నికల వేడి పెరిగే కొద్దీ కీలకమైన నియోజకవర్గాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు పెరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల కేటీఆర్ పర్యటన తర్వాత ఒక్క సారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ఆ పర్యటన సందర్భంగా కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు కొండా మురళి, కొండా సురేఖ తీవ్ర విమర్శలు చేయడంతో.. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి వారికి ఘాటు కౌంటర్ ఇచ్చారు. దాంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం ప్రారంభమయింది. దమ్ముంటే వచ్చి పరకాలలో పోటీ చేసి గెలవాలని కాంగ్రెస్ నేతలు కొండ మురళి, కొండా సురేఖలకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సవాల్ విసిరారు.
కొండా మురళి, కొండా సురేఖ భాష మార్చుకోవాలన్నారు. పరకాలలో గెలవలేక వరంగల్ పారిపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఉరికించి కొట్టారని, అదే మళ్లీ భవిష్యత్తులో రిపీట్ అవుతుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు. ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ధర్మారెడ్డి వ్యాఖ్యలైప కొండా మురళి స్పందించారు. అసలు ధర్మారెడ్డికి మా ఇంటి గేటు తెలుసా అంటూ ప్రశ్నించారు. నీ అంతు తేల్చడానికే వచ్చాను నేను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను, కొండా సురేఖ, తన బిడ్డ భాష బాగోలేదని చెప్పడానికి ధర్మారెడ్డి ఎవరని ప్రశ్నించారు.
పైపులు అమ్ముకొని బతికే వాడివని, కడియం శ్రీహరి దగ్గర ఉండి పదవులు పొందిన వాడివని.. నువ్వు కూడా మాట్లాడతావా అని ప్రశ్నించారు. పరకాలలో చేసిన అవినీతి, అక్రమాలు ప్రజలను ఎవరు అడిగినా చెబుతారని .. అలాంటి నువ్వు నాపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు కొండా మురళి. పరకాలలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చల్లా ధర్మారెడ్డి ఉరికించడం ఖాయమని కొండా మురళి పేర్కొన్నారు. బుల్లెట్లకు ఎదురొడ్డిన చరిత్ర తమదని, కొండా మురళీ ఎప్పటికీ భయపడడని అన్నారు. ధర్మారెడ్డిది నంది పైపులు అమ్ముకుని బతికిన చరిత్ర అని.. మహిళా ఎంపీపీని అవమానించిన నీచమైన చరిత్ర అంటూ ఆరోపించారు.
ధర్మారెడ్డి అరాచకాలు భరించలేక ఆయన కార్యకర్తలు తన దగ్గరకు వస్తున్నారని అన్నారు.కేటీఆర్ చెబితేనే ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారని, భయపడటం తన వంశంలోనే లేదన్నారు కొండా మురళి. తాను సన్నాసుల కాళ్లు మొక్కబోనని.. చెంచాగిరి అనేది బీఆర్ఎస్ పార్టీలోనే పుట్టిందన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పారు. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి మట్టి దొంగ అని, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కొవిడ్ సమయంలో చిన్న చిన్న దుకాణాల దగ్గర కూడా వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారుచెంచాగిరి అనేది బీఆర్ఎస్ పార్టీలో ఉందని పేర్కొన్న కొండా మురళి, తాను ఎక్కడికి రావడానికైనా సిద్ధమని డేటు, టైము ఫిక్స్ చేయమని సవాల్ విసిరారు.
ఆధునిక వసతులతో స్విమ్మింగ్ ఫూల్ నిర్మాణం.. ఫుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగించండి.. కమిషనర్ హరిత..
బీఆర్ఎస్ పార్టీలో దొరల పాలన సాగుతుందన్నారు. మైసమ్మ సాక్షిగా కొండ మురళి చెబుతున్నాడు నిన్ను పరకాలలో ఓడగొట్టటం ఖాయమని పేర్కొన్నారు.అధికారం ఎక్కువ రోజులు ఉండదని కొండా మురళి హెచ్చరించారు. అధికార గర్వం తో మాట్లాడితే దెబ్బ తింటావ్ అని హితవు పలికారు. కొండా మురళి భయపడేవాడు కాదని భయం అనేది తన వంశంలోనే లేదన్నారు. పరకాలలో తాము ధైర్యంగా ప్రచారం చేస్తారని, దమ్ముంటే ఆపాలని సవాల్ విసిరారు. వరంగల్ రాజకీయాలు క్రమంగా ఉద్రిక్తంగా మారుతూండటం.. రాజకీయవర్గాలను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. హింసాత్మకంగా మారుతాయేమోనన్న అనుమానాలు