డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో మంగళవారం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గంగాధర కనకయ్య ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అరెస్టయిన వారిలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జి గంగాధర కనకయ్య , రాష్ట్ర అధికార ప్రతినిధి దామెర సత్యం, కరీంనగర్ పార్లమెంట్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బోలుమల్ల సదానందం, ఐటీడీపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రవెల్లి రవీందర్,
తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఎర్రవెల్లి వీనిత్ , కొత్తపల్లి మండల అధ్యక్షులు ఆకుల కాంతయ్య, ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి తుంగ బాబు , ఎస్సీ సెల్ కార్యదర్శి పోతుల రాజేష్ , ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యుడు మెరుగు శ్రీనివాస్, మండల కార్యదర్శి ఎం.డి. అంకుస్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కొత్తపల్లి పోలీసులు తమను అరెస్ట్ చేయడం అక్రమం, అన్యాయమన్నారు. ఈ అరెస్ట్ లను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పేద ప్రజల గొంతు నొక్కడమే కాకుండా మనోధైర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం అణగదొక్కుతున్నదని, దీన్ని తెలంగాణ సమాజం ఖండిచాలని వారు కోరారు.