లడ్డాఖ్: లడ్డాఖ్లో ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 9 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. లేహ్వద్ద క్యారీ అనే గ్రామం గుండా ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయిందని అధికారులు తెలిపారు.
గ్రామం కంటే ఏడు కిలోమీటర్ల ముందే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గస్తీ కోసం వెళుతున్నప్పుడు ఈ దురదృష్టకర ఘటన చోటు చేసుకుందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రమాదంపై ఇంకా పూర్తివివరాలు తెలియరాలేదు.