Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రెండో భర్త అత్యాచారంతో కూతుళ్లకు సంతానం

0
  • రెండో భర్తకు పిల్లలు పుట్టాలని…..కూతుళ్లనే బలి పెట్టింది
  • భార్యాభర్తల విభేదాలతో గుట్టు రట్టు

ఏలూరు: సభ్య సమాజం తలదించుకునే ఘటన ఏలూరు లో జరిగింది. ఏతల్లి చేయకూడని పని ఈ కసాయి తల్లి చేసింది. వివరాల్లోకి వెళితే…. ఏలూరులోని వట్లూరు పంచాయతీకి చెందిన ఓ వివాహిత (38) తన రెండో భర్తకు సంతానం కలగాలని కన్న కూతుళ్లనే అతడి వద్దకు బలవంతంగా పంపి పిల్లలు పుట్టేలాగ చేసిందో కసాయి తల్లి. ఆమెతోపాటు ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఆమె రెండో భర్తపై దిశ పోలీసులు కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. ఏలూరులోని వట్లూరు పంచాయతీకి చెందిన ఓ వివాహిత (38) కు ఇద్దరు కుమార్తెలు. ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది.

భర్త అనారోగ్యంతో 2007లో మరణిం చాడు. తరువాత పుట్టా సతీష్ పవన్ కుమార్ (43)ను వివాహం చేసుకుంది. పిల్లలిద్దరినీ విశాఖపట్నంలోని తన పుట్టింటికి పంపించేసింది. ఆమెకు సంతానం కలగదని భావించిన సతీష్ కుమార్ మరో మహిళ ద్వారా సంతానం పొందుతానని చెప్పడంతో ఆమె తన ఇద్దరు కుమార్తెలు ఈడుకొచ్చారని, వారి ద్వారా సంతానం పొందాలని సూచించింది. పుట్టింటి వద్ద ఉన్న ఇద్దరు కుమార్తెలను తీసుకొచ్చింది. పెద్ద కుమార్తె 8వ తరగతి చదువుతున్న సమయంలో కన్న తల్లి ఆమెను సతీష్ కుమార్ వద్దకు పంపించింది. ఆ చిన్నారి ప్రతిఘటిం చినా వారిద్దరూ కలిసి చావబాదారు.

Also Read: BJP Leader Kidnap In Telangana (బీజేపీ నేత కిడ్నాప్)

ఆమె గర్భం దాల్చడంతో చదువు ఆగి, అందరికీ తెలిసిపోతుందని భయపడి అబార్షన్ చేయించారు. చివరకు పదో తరగతిలోకి రావడంతో మరోసారి ఆ విద్యార్థినిని గర్భవతిని చేశారు. 2021 జూన్ 3న పాప జన్మించింది. అయితే మగ బిడ్డ కావాలని సతీష్ చెప్పడంతో ఈసారి తన రెండో కుమార్తె (16)ను పంపింది. ఆమె కూడా గర్భం దాల్చ డంతో ఇంటిలోనే డెలివరీ చేశారు. ప్రాణం లేని మగశిశువు పుట్టడంతో ఆ బిడ్డను కాలువలో పడవేశారు. ఇటీవల సతీష్ కు, ఆమెకు గొడవలు రావడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లి పోలీస్ స్టేషన్లో వేధింపుల కేసు పెట్టింది. దీంతో పోలీసులు కౌన్సెలింగ్ కు పిలిచారు. ఆ తర్వాత సతీష్ అతని వద్ద ఉన్న తన భార్య కూతుళ్లిద్దరినీ తీసుకుని వచ్చాడు. అక్కడ ఆమె లేకపోవడంతో కుమార్తె లిద్దరినీ శారీరకంగా, మానసికంగా హింసించాడు. విషయం మేనమాకు తెలిసి. బుధవారం ఏలూరు చేరుకుని ఆడపిల్లలిద్దరినీ తీసుకుని దిశ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో దిశ పోలీసులు పుట్టా సతీష్ తోపాటు ఆమెపై పోక్సో కేసు, అత్యాచారం కేసులను నమోదు చేసి. ఇద్దరినీ అదుపు లోకి తీసుకుని విచారణ చేపట్టగా ఈ ఘోరం వెలుగుచూసింది. ప్రస్తుతం పెద్ద కుమార్తె మూడో నెల గర్భిణి అని పోలీసులు గుర్తించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie