విజయవాడ: విజయవాడలో మరోసారి లోన్ యాప్ ఆగడాలు కలకలం రేపాయి. భవానీపురం లో బాధితుడు రాజేష్ ఆత్మహత్య చేసుకోవడం స్థాని కంగా సంచలనంగా మారింది.ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడ టంతో సూసైడ్ చేసుకున్నాడు రాజేష్ అనే వ్యక్తి. విజయవాడలోని సూరయ పలెంలో గ్రామా నికి చెందిన తంగెళ్ళ మూడి రాజేష్ అనే వ్యక్తి కొంతకా లం క్రితం లోన్యాప్లో రుణం తీసుకున్నాడు. అయి తే.. ఆర్థిక సమస్యల కారణంగా అతడు సరైన సమ యానికి డబ్బులు తిరిగి ఇవ్వలేకపోయాడు.
ఇక అప్పటి నుంచి లోన్యాప్ నిర్వా హకులు రాజేష్ని వేధించడం మొదలు పెట్టారు.తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేసి భార్యకి పెడదామని బెదిరించారు. తనకు కొంత సమయం ఇవ్వమని ఎంత వేడుకున్నా.. వాళ్లు వినలేదు. చివరికి నిర్వాహకులు అన్నంత పని చేశారు. రాజేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి.. అతని భార్య రత్నకు పంపించారు.ఆ ఫోటోలను వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.దీంతో తీవ్ర అవమానంగా భావించిన రాజేష్.. ఆత్మహత్య చేసుకు న్నాడు.ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన భార్య కు ఫోన్ చేసి బోరున విలపిం చాడు.భార్య ఇంటికి వచ్చేసరికి.. రాజేష్ ఉరివేసుకొని,ఆత్మహత్యకు పాల్ప డ్డాడు.ఈ ఘటనపై రత్న పోలీ సుల్ని ఆశ్రయించగా.. వాళ్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.