- జమ్మిగడ్డ 33/11 కేవీ ప్రాంగణంలో..ఈ నెల 30 న శంకుస్థాపన
- ఏడుకోట్ల 15 లక్షల మంజూరు ..విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి
సూర్యపేట ఏప్రిల్ 27:సూర్యపేట సిగలో మరో మణిహారం మెరవనుంది.సమీకృత విద్యుత్ సర్కిల్ కార్యాలయం మంజూరు అయ్యింది.ఈ మేరకు టి యస్ యస్ పి డి సి ఎల్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.ఒకే చోట సర్కిల్ (యస్ ఇ)కార్యాలయం,డివిజనల్ ఇంజినీర్ కార్యాలయంతో పాటు సబ్ డివిజనల్ ఇంజినీర్ కార్యాలయం,ఈ ఆర్ ఓ కార్యాలయం భవనాలు నిర్మించేందుకు గాను ఏడూ కోట్ల 15 లక్షల 61 వేల 885 రూపాయలను మంజూరు చేశారు.విద్యుత్ వినియోగ దారులకు అనువుగా ఒకే చోట విద్యుత్ కార్యాలయాలు ఉండే విదంగా మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి మంజూరు చేయించారు.జిల్లా అభివృద్ధిపై మరోసారి తనదైన ముద్ర వేసుకున్నారు ఒకే పని మీద విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరిగి కాలయాపన చేసుకోకుండా ఉండేందుకు చేసిన ఈ ఏర్పాటు పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
సూర్యపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ 33/11 కేవీ సబ్ స్టేషన్ ప్రాంగణంలో ఈ సమీకృత కార్యాలయ భవనాలు నిర్మించ నున్నారు.ఈ మేరకు ఈ నెల 30 న భవన నిర్మాణ పనులను మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా జరిపించేందుకు విద్యుత్ శాఖాధికారులు నిర్ణయించారు.కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు జిల్లాగా రూపాంతరం చెందిన సూర్యపేటలో ఇప్పటికే మెడికల్ కళాశాల,సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాలు,యస్ పి కార్యలయం,ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తో ప్రగతి వైపు పరుగులు పెడుతున్న సూర్యపేట జిల్లా కేంద్రంలో విద్యుత్ స్టోర్స్ ను మంజూరు చేయించడంతో మారుమూల రైతాంగానికి పని సులువుగా మారింది.దానికి తోడు ఏకంగా జిల్లా కేంద్రంలో సమీకృత విద్యుత్ శాఖా కార్యాలయాల భవనాలు నిర్మించడతో ఇకపై విద్యుత్ వినియోగ దారులకు పనులు సులబతరమౌతాయి.