జగన్ సర్కార్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి (శుక్రవారం) జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించింది. మొత్తం 11 రకాల సర్టిఫికెట్‌లు జారీ కోసం నిర్వహించే ఈ క్యాంపుల్లో ఇప్పటి వరకూ తీసుకుంటున్న యూజర్ చార్జ్‌లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న సురక్ష కింద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్టిఫికెట్‌లు కోరే వారికి కుల, నివాస, ఆదాయ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్‌లు.. ఇలా 11 సర్టిఫికెట్లకు ఎటువంటి చార్జీలు లేకుండా అందించాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. అంటే దాదాపు 11 రకాలైన సర్టిఫికెట్లు ఉచితంగానే ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు జీఓఆర్‌టీ నెంబరు 10ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.