Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

బ్రాహ్మ‌ణ ప‌రిష‌త్‌కు ఏటా రూ. 100 కోట్లు కేటాయిస్తున్నాం.. విప్రహిత ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్..

0

రాష్ట్రంలోని అర్చ‌కుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. వేద‌శాస్త్ర పండితుల‌కు ప్ర‌తి నెల ఇస్తున్న గౌర‌వ‌భ‌వృతిని రూ. 2,500 నుంచి రూ. 5 వేల‌కు పెంచుతున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గోప‌న్‌ప‌ల్లిలో 9 ఎక‌రాల స్థ‌లంలో నిర్మించిన విప్ర‌హిత బ్రాహ్మ‌ణ సంక్షేమ‌ స‌ద‌నాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.  రాష్ట్రంలోని అర్చ‌కుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. వేద‌శాస్త్ర పండితుల‌కు ప్ర‌తి నెల ఇస్తున్న గౌర‌వ‌భ‌వృతిని రూ. 2,500 నుంచి రూ. 5 వేల‌కు పెంచుతున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు.

 

శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గోప‌న్‌ప‌ల్లిలో 9 ఎక‌రాల స్థ‌లంలో నిర్మించిన విప్ర‌హిత బ్రాహ్మ‌ణ సంక్షేమ‌ స‌ద‌నాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో బ్రాహ్మ‌ణుల సంక్షేమాన్ని ఉద్దేశించి కేసీఆర్ ప్ర‌సంగించారు.బ్రాహ్మ‌ణ స‌ద‌నాన్ని ప్రారంభించుకున్న నేటి శుభ సంద‌ర్భంలో బ్రాహ్మ‌ణుల సంక్షేమం కోసం ప్ర‌భుత్వం తీసుకున్న మ‌రిన్ని నిర్ణ‌యాల‌ను మీ అంద‌రికీ తెలియ‌జేయ‌డానికి సంతోషిస్తున్నాను అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం బ్రాహ్మ‌ణ ప‌రిష‌త్ ద్వారా వేద‌శాస్త్ర పండితుల‌కు ప్ర‌తి నెల ఇస్తున్న గౌర‌వ భృతిని రూ. 2,500 నుంచి రూ. 5 వేల‌కు పెంచుతున్నాం. ఈ భృతిని పొందే అర్హ‌త వ‌య‌సును 75 ఏండ్ల నుంచి 65 ఏండ్ల‌కు త‌గ్గిస్తున్నాం అని కేసీఆర్ ప్ర‌క‌టించారు.

లిక్కర్ స్కామ్ లో కవిత పేరు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలోని 3,645 దేవాల‌యాల‌కు ధూప‌దీప నైవేద్య ప‌థ‌కం వ‌ర్తిస్తున్న‌ది అని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మ‌రో 2,796 దేవాల‌యాల‌కు కూడా ధూప‌దీప నైవేద్యం ప‌థ‌కం విస్త‌రింప‌జేస్తాం. దీంతో రాష్ట్రంలో 6,441 దేవాయాలకు ధూప‌దీప నైవేద్యం కింద నిర్వ‌హ‌ణ వ్య‌యం అందుతుంది. ఈ సంద‌ర్భంగా మ‌రో శుభ‌వార్త కూడా మీతో పంచుకుంటున్నాను. ఇప్ప‌టి వ‌ర‌కు ధూప‌దీప నైవేద్యం ప‌థ‌కం కింద దేవాల‌యాల నిర్వ‌హ‌ణ కోసం అర్చ‌కుల‌కు నెల‌కు రూ. 6 వేల చొప్పున ప్ర‌భుత్వం అందిస్తున్న‌ది. ఈ మొత్తాన్ని రూ. 10 వేల‌కు పెంచుతున్నామ‌ని తెలియ‌జేస్తున్నాను. ఈ నిర్ణ‌యం మీ అంద‌రిని ఎంతో సంతోష‌పెడుతుంద‌ని భావిస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.

 

వేద పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ కోసం ఇస్తున్న రూ. 2 ల‌క్ష‌లను ఇక నుంచి యాన్యువ‌ల్ గ్రాంట్‌గా ఇస్తామ‌ని తెలియ‌జేస్తున్నాను అని కేసీఆర్ తెలిపారు. ఐటీఎం, ఐఐఎం లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క సంస్థ‌ల్లో చ‌దివే బ్రాహ్మ‌ణ విద్యార్థుల‌కు ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని వ‌ర్తింజేసే నిర్ణ‌యం తీసుకున్నాం. అదే విధంగా అనువంశిక అర్చ‌కుల స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌లో కేబినెట్‌లో చ‌ర్చించి ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇస్తున్నాను. స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ నిల‌యంగా, వేద పురాణాల ఇతిహాసంగా, విజ్ఞాన స‌ర్వ‌సంగా, వైదిక క్ర‌తువుల క‌ర‌దీపిక‌గా, పేద బ్రాహ్మ‌ణుల ఆత్మ‌బంధువుగా, లోక క‌ల్యాణ‌కారిగా తెలంగాణ బ్రాహ్మ‌ణ ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో ఈ విప్ర‌హిత వెలుగొందాల‌ని ఆ దేవ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.

 

సంక్షేమ సదనం ప్రారంభం
విప్రహిత బ్రాహ్మణ సదనం భవనాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రారంభించారు. ప్రారంభోత్స‌వ కార్య‌క్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సుర‌భి వాణిదేవీ, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారి, పీఠాధిప‌తులు, పండితులు పాల్గొన్నారు.ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామంలో 6 ఎకరాల 10 గుంటల స్థలాన్ని కేటాయించింది.

ఓఆర్ఆర్ టోల్ టెండర్ వ్యవహారాన్ని ప్రజల ముందుంచాలి.

ఇందులో బ్రాహ్మణ సమాజ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 12 నిర్మాణాలను చేపట్టారు. 2017 జూన్‌ 5న పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. మూడంతస్థుల్లో ఉన్న ఈ భవనంలో కల్యాణ మండపం, సమాచార కేంద్రం, పీఠాధిపతుల, ధర్మాచార్యుల సద నం ఉన్నాయి. భక్తి, ఆధ్మాత్మిక భావజాల వ్యాప్తికి సంబంధించిన సమస్త సమాచార కేంద్రంగా, రిసోర్స్‌ సెంటర్‌గా ఈ భవనం సేవలందించనున్నది. ఆధ్యాత్మిక గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల వంటి సాహిత్యంతో కూడిన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie