Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అంగన్ వాడి సిబ్బందిపై కోతుల దాడి

0

తీవ్రంగా గాయపడిన టీచర్ భారతమ్మ, హెల్పర్ తహేర బేగం
అంగన్ వాడి కేంద్రాన్ని శుభ్ర పరిచేందుకు వెళ్లిన అంగన్ వాడి టీచర్ తో పాటు సహయకురాలిపై కోతుల సమూహం దాడి చేసిన సంఘటన ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. రాయపోలు గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ భారతమ్మ, హెల్పర్ తహేర బేగంలు గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని శుభ్రం చేసేందుకు వెళ్ళారు.

వారిపై కోతులు సమూహంగా వచ్చి దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తీవ్ర గాయాలైన వారిని స్థానికులు ఇబ్రహీంపట్నం సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కోతుల బెడద తీర్చాలని పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికే కోతులు దాడి చేసి ఎంతో మందిని గాయపరిచాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie