విజయవాడ, జూలై18: Indian Premier League ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే ప్రయోగాలకు పెట్టింది పేరు.. 8 జట్లతో ప్రేక్షకులకు అలరిస్తున్న ఐపీఎల్లో కొత్తగా రెండు జట్లను తీసుకువచ్చింది బీసీసీఐ. ఈ క్రమం లోనే గత ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ అనే రెండు జట్లను ఐపీఎల్లోకి తీసుకు వచ్చింది బీసీసీఐ. ప్రస్తుతం పది జట్లు ఐపీల్ లో ఉన్నాయి. ఉన్న వాటి సంఖ్యను మరింత పెంచాలని ఆలోచిస్తుందట బీసీసీఐ.ఈ క్రమంలోనే ఏపీ కోసం ప్రత్యేకంగా ఒక ఫ్రాంచైజీకి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్ కోసం బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీలను అవకాశమిస్తుండగా.. ఇక బిడ్డింగ్ దక్కించుకునే దిశగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడుగులు వేస్తుంది.
దీనికి సంబంధించిన ఏర్పాట్లకు రెడీ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్. దీనికి సంబంధించి ఆటగాళ్ల ప్రాక్టీస్ కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కి ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారని సమాచారం.విశాఖలో ఉన్న స్టేడియం ఇక ఆంధ్రప్రదేశ్ టీంకి హోమ్ గ్రౌండ్‌గా మారుతుందని టాక్. ఒకవేళ ఏపీ క్రికెట్ అసోసియేషన్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయితే మాత్రం ఇక ఐపీఎల్‌లోకి కొత్తగా vizag warriors ipl team players list ఆంధ్ర నుంచి ఒక ఫ్రాంచైజీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్‌లో కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
Courtesy: (న్యూస్ పల్స్)