గాజువాక: మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినందుకు నిరసనగా పాత గాజువాక జంక్షన్లో Andhra Pradesh Chief Minister Jaganmohan Reddy ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను హత్యాచార ఆంధ్రప్రదేశ్ మార్చిన వైకాపా గవర్నమెంట్ ను రానున్న రోజుల్లో తెలుగు మహిళలు బుద్ధి చెబుతారు అని అన్నారు.
నిజాయితీగా ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్షాలపై కేసు పెట్టడం కాదు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు గంట అరగంట అనే మంత్రులని పై కేసు పెట్టాలి.ఈరోజు అత్యాచారాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. రెండు సంవత్సరాల పసికం నుంచి 70 సంవత్సరాల వృద్ధులను కూడా వదలట్లేదు.ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారో తెలియదు, మహిళా కమిషన్ చైర్మన్ ఏం చేస్తున్నారు తెలియదు వీళ్ళకి స్క్రిప్ట్ ఇస్తే చదవడం తప్ప ఏమీ తెలియదు రానున్న రోజుల్లో వైకాపా ప్రభుత్వానికి రాష్ట్రంలో మహిళలు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు.