నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామం సమీపంలో విమానం ఆకారంలో ఉన్న డ్రోన్ పొలాల్లో లభ్యం అయింది. అడవిలో గొర్రెల కాపరికి ఏరోప్లేన్ ఆకారంలో ఉన్న డ్రోన్ కనబడింది. దాంతో ఆ గొర్రెల కాపారి డయల్ 100కి కాల్ చేసి విషయం చప్పాడు. పోలీసులు అక్కడి చేరుకుని డ్రోన్ ను శాలిగౌరారం పోలీస్ స్టేషన్ కి తరలించారు. అది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు దీన్ని ఆపరేట్ చేశారు అన్న విషయాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.