జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులతో సిఎల్పీ నేత భట్టి పర్యటన
With the farmers who are losing their land on the national highway CLP leader Bhatti's visit
పోలీసులతో బలవంతపు భూసేకరణ చేస్తున్నారని రైతుల ఫిర్యాదు
అమరావతి – నాగపూర్, ఖమ్మం – దేవర పల్లి జాతీయ రహదారి రోడ్డుల విస్తరణ కారణంగా భూమి కోల్పోతున్న రైతులతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆదివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం వందనం-కోదుమూరు వద్ద హైవే పనులను రైతుల తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు సిఎల్పీ నేత దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. విలువ గల భూములకు తక్కువ రేటు ఇస్తున్నారు అని, బావులకు, పొలాల్లో రైతులు వేసుకున్న పైపూ లైన్లుకు ఎటువంటి నష్టపరిహారం అందించడం లేదని రైతులు తెలిపారు.
ఖమ్మం నుండి వివిధ గ్రామాలకు వెళ్ళే దారుల వద్ద అండర్ పాస్ ఏర్పాట్లు చేయాలని,అలాగే సర్వీస్ రోడ్లు కూడా వేయాలని కోరారు. రైతులమైన మాకు కనీస గౌరవం ఇవ్వకుండా పోలీసు బలగాలను పెట్టీ బలవంతంగా తమ భూములు లాకున్నరు అని భట్టి వద్ద రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అక్కడ నుండే ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ తో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉన్నత అధికారులతో మాట్లాడి వీలైనంత వరకు మీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా రైతులకు భట్టి హామీ ఇచ్చారు.