పోలీసు శాఖకు అత్యాధునిక సామాగ్రి
వరదలు తదితర విపత్కర పరిస్థితుల్లో బాధితులను కాపాడటంలో పోలీసు శాఖ కీలకమని కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా ఎస్పీ ప్రవీణ్ కుమార్ తో కలిసి పోలీసులకు అత్యాధునిక పరికరాలు అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిర్మల్ లో పోలీసులకు ఎయిర్ బోట్స్, లైఫ్ జాకెట్లు, రోప్స్ శుక్రవారం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్నటి వరకు సుమారు 210 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయిందన్నారు. ఈ సందర్భంగా ప్రమాదాల్లో చిక్కుకున్న చాలా మందిని పోలీస్ శాఖ రెస్క్యూ బృందం కాపాడిందన్నారు. సుమారు 60 మందిని వివిధ పోలీస్ సిబ్బంది ప్రాణాన్ని పణంగా పెట్టి కాపాడారని పేర్కొన్నారు.
ఇలాంటి విపత్తులు ఏర్పడినప్పుడు ప్రాణహాని కలగకుండా వారిని సులువుగా కాపాడేందుకు ఎయిర్ బోట్స్, లైవ్ జాకెట్లు మరియు రోప్స్ అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పరికరాల కొనుగోలుకు సహకరించి కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుయంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధునపు ఎస్పి (ఏఆర్) వెంకటేశ్వర్లు, నిర్మల్ డిఎస్పి గంగారెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పట్టణ సీఐ పురుషోత్తం, ఆర్ఐలు రమేష్, రామకృష్ణ, ఎంపీఓ వినోద్, ఆర్ఎస్ఐలు సాయికిరణ్, రవికుమార్, దేవేందర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.