సుమారు రెండు నెలల విరామం అనంతరం గంగపు త్రులు చేపల వేటకు సిద్దమైయ్యారు.మరపడవలు, ట్రాలర్లు, మినీ బోట్లు బుధవారం అర్ధరాత్రి దాటాక చేపల వేటకు వెళుతున్న నేపథ్యంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లికి విశేష పూజలు నిర్వ హించారు. ఫిషింగ్ హార్బర్ ఆవరణ లోని గంగమ్మ తల్లికి తెల్లవారుజాము నుంచి పంచామృత అభిషే కాలు, పసు పు నీళ్లతో అర్చన లు, కుంకుమార్చ నలు, అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించారు. మహిళలు ఊరేగిం పుగా సముద్రతీరా నికి వెళ్లి సముద్రు డిని పసుపు నీళ్లతో అభిషేకించి ప్రార్థిం చారు.మత్స్యకా రుల సంఘం నాయ కులు వాసుపల్లి జానకి రామ్, ఎమ్మె ల్యే గణేష్ కుమార్ అమ్మవారిని దర్శిం చుకున్నారు. ఉత్స వాల నేపథ్యంలో ఫిషింగ్ హార్బర్ లో కోలాహలమైన వాతావరణం నెలకొంది.