ఏమ్మిగనూరు:పట్టణంలోని పౌర సరఫరాల గొదాం పాయింట్ ను గురువారం ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రేషన్ నిల్వ, రికార్డ్స్, భద్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ బియ్యం కార్డ్ లబ్ధిదారులకు పంపిణీ చేసే పక్రియలో ఏటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ జయన్న, ఎలక్షన్ ఉప తాసిల్దార్ గురు రాజారావు, మండల సర్వేయర్ అశోక్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.