అన్నమయ్య జిల్లా మదనపల్లి సొసైటీ కాలనీలో జరిగిన అగ్నిప్రమాదంలో లక్ష రూపాయల ఆస్తి నష్టం వాటిల్లందని పోలీసులు తెలిపారు. వన్ టౌన్ సీఐ మహబూబ్ బాషా కథనం మేరకు పట్టణంలోని సొసైటీ కాలనీలో కాపురం ఉంటున్న రెడ్డప్ప భార్య నాగలక్ష్మి(45), ఇంట్లో గ్యాస్ స్టవ్ పక్కన ఉన్న కట్టెల పోయ్యి వెలిగించి వీధిలో కూర్చుని పక్కింటి వాళ్ళతో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న విలువైన లక్ష రూపాయల సామాగ్రి అగ్నికి ఆహుతి అయింది. ఆలస్యంగా గుర్తించిన ఆమె మంటలను అదుపు చేసేందుకు అగ్ని మాపక అధికారులకు పోలీసులకు సమాచారం అందించింది. వారు వచ్చేలోపే అగ్నిప్రమాదంలో ఇంట్లో ఉన్న సుమారు లక్ష రూపాయలు విలువ చేస్తే ఫర్నిచర్ కాలిపోయింది. మాటలను అదుపు చేసే క్రమంలో నాగలక్ష్మి స్వల్పంగా గాయపడి మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.