- రెండు కార్ల ఢీ…ఆరుగురికి గాయాలు
- తిరుపతి నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుండగా ప్రమాదం
తిరుమల ఘాట్ రోడ్లలో వరుస రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మంగళవారం నాడు రెండోవ ఘాట్ రోడ్డులో గోవింద మలుపు సమీపంలో ఒక కారు అదుపుతప్పి రైలింగ్ ఢీ కొంది. కారు టైర్ పంచర్ అయ్యి తిరుగుతూ రోడ్డుపైకి వచ్చిన కారును వేగంగా మరో కారు ఢీ కొంది.
Also Read: ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చిన రష్యా
ఈ ఘటనలో ఆరుగురు భక్తులకు గాయాలు అయ్యాయి. మరియు విజయవాడకు చేందిన ఇద్దరు వృద్దులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని పోలీసులు తిరుమల ఆశ్వినీ ఆసుపత్రి కి తరలించారు. అతివేగమే ప్రమాదమునకు కారణంగా గుర్తించారు. తిరుపతి నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుండగా ప్రమాదం జరిగింది.