కాకినాడ: పెద్దాపురం మండలం జి రాగంపేట లో ఘోర ప్రమాదం జరిగింది. అంబటి సుబ్బయ్య ఫ్యాక్టరీలో ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేసేందుకు కార్మికులు ట్యాంకర్లోకి దిగారు. ప్రమాదవశాత్తు ట్యాంకర్లో ఊపిరాడకపోవడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందాడు.. మృతుల్లో ఐదుగురు పాడేరు వాసులుగా, మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరువాసులుగా గుర్తించారు.
అయిల్ ఫ్యాక్టరీ ఇంకా నిర్మాణంలో ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. మృతులు పాడేరుకు చెందిన మొచ్చంగి కృష్ణా, మొచ్చంగి నరసింగా, మొచ్చంగి సాగర్, కురతాడు బంజు బాబు, కుర్ర రామారావు, పులిమేరు గ్రామానికి చెందిన కట్టమురి జగదీష్, ప్రసాద్‌గా గుర్తించారు