Big Breaking: మైహోం పరిశ్రమలో ప్రమాదం, ఐదుగురు కార్మికుల దుర్మరణం
major accident occurred at Myhome Cement Industries in Mellacheruvu, five workers died
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు లోని మైహోం సిమెంట్ పరిశ్రమలలో భారీ ప్రమాదం సంభవించింది. ప్లాంట్ ఎగువ భాగంలో స్లాబ్ వేస్తుండగా.. కార్మికులపై స్లాబ్ కూలింది. దాదాపు 600 ఫీట్లు ఎత్తు నుంచి ఆరుగురు కార్మికులు కిందపడిపోయారు.
Also Read: ముస్లిం లందరికీ మంత్రి హరీష్ క్షమాపణలు చెప్పాలి
ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మూడు మృతదేహాలను వెలికితీసారు. క్షతగాత్రులు ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన వారుగా గుర్తించారు. మైహోమ్ యాజమాన్యం ప్రమాదంపై గోప్యత పాటిస్తోంది. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం వున్నట్లు సమాచారం.