నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్కూల్స్ ,కళాశాలల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. విద్యా చట్టాలను అమలు చేయడం లో వైసీపీ ప్రభుత్వం విఫలం అవుతుందని అఖిల భారత విద్యార్థి పరిషత్ నిరసన ప్రదర్శన చేపట్టింది. కార్పొరేట్ విద్యా విధానాలకు వ్యతిరేకంగా ఏబివిపి కార్యకర్తలు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం లోకి చొచ్చుకొనివచ్చారు. రాష్ట్రం లో విద్యా హక్కు చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబివిపి నేతలు, కార్యకర్తలు విద్యా శాఖ అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారు. అదే సమయంలో కార్యాలయం గేటు దాటి లోపలి పోలీసులు అనుమతి నిరాకరించడం తో పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ కార్యాలయం లోకి దూసుకెళ్లారు.
మాడ్గుల పోలీసు స్టేషన్ లో బల్మూరి వెంకట్ ను పరామర్శించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.కార్యాలయం లోపలికి దూసుకెళ్లిన ఎబివిపి నేతలు విద్యాశాఖ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు తో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబిఎస్ విద్య పేరుతో కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షల్లో దండుకుంటున్నారని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్రం లో విద్యా హక్కు చట్టాలను కఠినంగా అమలు చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఏబీవిపి నేతలు హెచ్చరించారు..