ఆధార్ అప్ డేట్ ను ఉచితంగా చేసుకునేందుకు గడువును మరో మూడు నెలల పాటు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) పెంచింది. వాస్తవానికి ఈనెల 14తో అప్ డేట్ గడువు ముగియనుంది. అయితే ఈ గడువు డిసెంబర్ 14 వరకు పెంచారు. ఆధార్ యూజర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు గడువును మరో మూడు నెలల పాటు పెంచినట్లు పేర్కొంది.
మై ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా ఆధార్ డాక్యూమెంట్లను అప్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. కాగా, ఆధార్ జారీ పదేళ్లు దాటిన వారి వివరాలను మళ్లీ అప్‌డేట్ చేసే ప్రక్రియను యూఐడీఏఐ ప్రారంభించింది. అడ్రస్, వ్యక్తిగత వివరాలు మార్చుకోవాలనునేవారు అందుకు సంబంధించిన ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.