‘నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. మిర్నా మీనన్ కథానాయికగా నటించింది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో ఉగ్రంపై అంచనాలని పెంచాయి. మే 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ‘ఉగ్రం’ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు మిర్నా మీనన్.
మీ ప్రయాణం గురించి చెప్పండి ? ‘ఉగ్రం’ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
నేను డెవలపర్ ని. దుబాయి లో ఇంజనీర్ గా పని చేశాను. తర్వాత కేరళ వచ్చి పని చేశాను. కానీ చిన్నప్పటి నుంచి సినిమా ఇష్టం. యాక్టర్ అవ్వాలని వుండేది. ఒక రోజు దర్శకుడు అమీర్ నుంచి కాల్ వచ్చింది. తమిళ్ లో ఆర్యతో నటించే అవకాశం వచ్చింది. అలా నా యాక్టింగ్ కెరీర్ మొదలైయింది. తర్వాత సూపర్ స్టార్ మోహన్ లాల్ గారి ‘బిగ్ బ్రదర్’ చేశాను. అదే సమయంలోనే లాక్ డౌన్ వచ్చింది. దీని తర్వాత ‘క్రేజీ ఫెలో’ చేశాను. దీని తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ గారి ‘జైలర్’ సినిమాలో అవకాశం వచ్చింది. అది ఫస్ట్ షెడ్యూల్ లో ఉండగానే ఉగ్రం దర్శకుడు విజయ్ సంప్రదించారు. అలా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను.
ఉగ్రంలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
నాంది టీం మళ్ళీ కలసి చేస్తున్న సినిమా ఉగ్రం. దర్శకుడు విజయ్ గారికి వర్క్ నాకు చాలా ఇష్టం. అలాగే నరేష్ గారికి నేను అభిమానిని. ఉగ్రం కథ చెప్పినప్పుడే ఓకే చెప్పేశాను. కథ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఇందులో నా పాత్ర ఛాలెజింగ్ గా వుంటుంది. కాలేజీ అమ్మాయిగా, భార్యగా, ఒక బిడ్డకు తల్లిగా.. ఇలా భిన్నమైన కోణాలు నా పాత్రలో కనిపిస్తాయి. కెరీర్ బిగినింగ్ లో ఇలాంటి పాత్ర చేయడం సవాలే. ఆ సవాల్ ని స్వీకరించి ఈ పాత్రని చేశాను.