అవనిగడ్డ: టీడీపీ నేతలు చేపట్టిన ఇసుక సత్యాగ్రహంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నాయకుల ప్రసంగాలకు ఘంటసాల ఎస్ఐ శ్రీనివాసు అడ్డుతగిలారు. అనుమతలు ఉన్నాయని జేపీ సిబ్బంది తో మాట్లాడించే ప్రయత్నం టీడీపీ నేతలు చేసారు. అక్కడి సిబ్బంది టీడీపీ నేతల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయారు.
Also Read:
మే లో జేపీ సంస్థ గడువు పూర్తయితే ఎలా రవాణా చేస్తున్నారని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ ప్రశ్నించారు. ప్రసంతంగా నడుస్తున్న నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తతలు తీసుకువచ్చేలా ఎస్ఐ వ్యవహరించారని మాజీ ఎంపీ కొనకళ్ల మండిపడ్డారు. ఇసుక తరలింపుకు అనుమతులు చూపాలని బుద్ధప్రసాద్ డిమాండ్ చేసారు.