చినుకు పడితే చాలు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ జలమయంగా మారుతుంది. గతంలో ఈ మరమ్మత్తు పనులు తూ తూ మంత్రంగా చెయ్యడంతో ఈ సమస్య ఏర్పడింది. ఈ మేరకు ప్రయాణీకులు కాంప్లక్స్ వెళ్ళాలంటే నానా అవస్థలు పడుతుంటారు. అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్లే కాంప్లెక్స్ చెరువు లా తయారువతుదని పలువురు ప్రయణికులు వాపోతున్నారు.
అయితే ముస్సిపల్ కాలువలు నుండి మురుగు నీరు కాంప్లెక్స్ లోకి రావడంతో కాంప్లెక్స్ లో దుర్వాసనలు వేదజెల్లుడంతో, ప్రయాణీకులు రాక పోకలకు త్రీవ ఇబ్బందులకు పడుతున్నారు. ఈ విషయం ఆర్టీసీ అధికారులకి,రాజకీయ నాయకులకు తెలిసినప్పటికీ చూసి చూడనట్టుగా వ్యవరించడం ఓ విశేషం. అయితే గత 40 సంవత్సరాలుగా ఇలాంటి దుబ్బరమైన పరిస్థితి పునరావతం అవుతున్నప్పటికీ అధికారులు,రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదు. తక్షణమే ఆర్టీసీ అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కారం చెయ్యాలని పలువురు ప్రయణికులు కోరుతున్నారు.