వారు వైద్య విద్యార్థులు, ఆదివారం సెలవు దినం కావడం వల్ల సరదాగా విహార యాత్ర కు వెళ్లారు. అ విహార యాత్ర విషాదం కలిగించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ రిమ్స్ లో పిజీ చేస్తున్న విద్యార్థులలో ఎనిమిది మంది విద్యార్థులు విహార యాత్ర కు వెళ్లాలని నిర్ణహించారు.
ఆదిలాబాద్ రూరల్ మండలం లో గల కోటిలింగాల సందర్శన కోసం ఆదివారం బయలుదేరారు. కోటి లింగాల దర్శనం అనంతరం పక్కనే గల నది వద్ద ఫోటోలు దిగుచుండగా ఒక్కరి సెల్ ఫోన్ నీళ్లలో పడింది. ఫోన్ కోసం ముగ్గురు విద్యార్థులు నదిలో దిగ్గారు.. ఇద్దరు బయటకు రాగా పీజీ వైద్య విద్యార్థి ప్రవీణ్(27) నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం నుండి ఆదిలాబాద్ రూరల్, జైనథ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని,స్థానికులు గజ ఈతాగాల్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు సోమవారం తెల్లవారు జామున వైద్య విద్యార్థి ప్రవీణ్ మృతదేహం లభ్యమైంది. దీంతో స్నేహితుల రోదనలు మిన్నంటాయి. మృతుడు సిరిసిల్ల జిల్లా విర్నాపల్లి మండలం లోని రంగంపేట్ గ్రామానివాసి.ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.