Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

అన్ని పార్టీలకు ఫ్యానే టార్గెట్.

0

రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రత్యర్థి పార్టీలన్నింటితోనూ పోటీ పడాలి. తెలంగాణలో మూడు పార్టీలు అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుత భారాస), కాంగ్రెస్‌, బీజేపీ. బండి సంజయ్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీ అక్కడ శరవేగంగా దూసుకుపోతోంది. కర్ణాటకలో గెలుపుతో కాంగ్రెస్‌ కూడా ఉత్సాహంగా ఉంది. తొమ్మిదేళ్లుగా అధికారాన్ని అనుభవిస్తున్న భారాస మూడో గెలుపు కోసం ప్రయత్నిస్తోంది. మూడు పార్టీలు ఒకదానిపై మరొకటి తీవ్రమైన విమర్శలు చేసుకుంటాయి.ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. బీజేపీ, తెలుగుదేశం, జనసేన వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని సాధించడమే లక్ష్యమని ప్రకటిస్తున్నాయి.

 

మొన్నటి వరకూ పొత్తుల కబుర్లాడిన ఈ మూడు పార్టీలు ఇప్పుడు ఒంటరిగానే అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నాయి. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన అమిత్‌షా 20 ఎంపీ సీట్లను టార్గెట్‌ ఫిక్స్‌ చేశారు. అంటే ఎనభై శాతం సీట్లన్నమాట. అలా అయితే 80 శాతం ఎమ్మెల్యే స్థానాలు కూడా సాధించి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉన్నట్లే కదా! తెలుగుదేశం తమ టార్గెట్‌ 160 సీట్లు అంటోంది. పవన్‌ కళ్యాన్‌ కూడా వారాహి విజయయాత్రలో తనను సీఎం చేయాలని ఓటర్లను కోరుతున్నారు. బంగారు ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేస్తానని చెబుతున్నారు అధికార వైకాపాపై తీవ్రమైన ఆరోపణలు చేయడం.. సీఎం జగన్మోహన్‌రెడ్డిని వ్యక్తిగతంగా నిందించడం.

అంతర్రాష్ట్ర చెక్ పోస్టును తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. బీజేపీ, టీడీపీ, జనసేన కేవలం అధికార పార్టీనే విమర్శిస్తాయి. ఈ మూడూ తమలో తాము విమర్శించుకోవు. నిజానికి సొంతంగా అధికారంలోకి రావాలనుకుంటే ప్రత్యర్థులందరితోనూ పోరాడాలి. ఇతర పార్టీలను కూడా విమర్శిస్తే… న్యూట్రల్‌ ఓట్లు, ప్రత్యర్థి పార్టీలంటే గిట్టని వాళ్ల ఓట్లు వస్తాయి. కానీ మూడు పార్టీలూ జగన్‌నే టార్గెట్‌ చేస్తూ పరోక్షంగా మేమంతా ఒక్కటే అనే భావాన్ని ప్రజల్లో కలిగిస్తున్నారు. పొత్తుల్లేవు అంటూ రహస్య అవగాహనతో పనిచేస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జగన్‌ మాత్రం తాను ఒక్కడినే పోరాడతానని చెబుతున్నారు. కానీ బీజేపీకి, వైకాపాకు మధ్య రహస్య ఒప్పందం ఉందని మరో వెర్షన్‌ కూడా వినిపిస్తోంది. ప్రజలు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie