ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మేడిపల్లి శివార్ లో జాతీయ రహదారిఫై ద్విచక్ర వాహనాన్ని లారి డికోట్టిన ఘటనలో మెట్పల్లి మున్సిపాలిటీలోని టౌన్ మిషన్ కోఆర్డినేటర్ గా విధులు నిర్వహిస్తున్న బెజ్జంకి రాజయ్య(53) అక్కడికక్కడే మృతి చెందాడు. మల్యాల మండలం నూకపల్లి గ్రామానికి చెందిన బెజ్జంకి రాజయ్య మెట్పల్లి మున్సిపాలిటీలోని టౌన్ మిషన్ కోఆర్డినేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
అందులో భాగంగా రాజయ్య ఉదయం ద్విచక్ర వాహనంఫై నూకపల్లి నుంచి మెట్పల్లి వెళ్తుండగా మేడిపల్లి శివారులోని రైస్ మిల్ సమీపంలో వేగంగా వెనుక నుంచి వస్తున్న లారీ డికోట్టింది. ఈ ఘటనలో రాజయ్య తల నుజ్జునుజ్జై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుకున్న మేడిపల్లి పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద ఘటనను పరసిలించి మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య సునీత ఫిర్యాద్ మేరకు మద్యం సేవించి లారీని అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి ప్రమాదానికి కారణం అయిన కరీంనగర్ చెందిన లారీ డ్రైవర్ షేక్ హైమద్ ఫై ఎస్ ఐ కేస్ నమోద్ చేయగా, కోరుట్ల సిఐ ఎం. ప్రవీణ్ కుమార్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.