సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న విద్యుత్ నగర్ కాలనీలో తల్లి ఇద్దరు కుమారులు మిస్సింగ్ అయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన యేసయ్య తన కుటుంబ సభ్యులతో జీవనోపాధి గురించి విద్యుత్ నగర్ నాలుగు రోజులకి క్రితం వలస వచ్చాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారులను అభిలేష్ ,పృథ్విని స్థానిక పాఠశాలలో చేర్పించారు. శనివారం పాఠశాలకు వెళ్లిన కుమారులు సాయంత్రం తల్లి యశోద పిల్లలను తీసుకురానికే స్కూల్ వద్దకు వెళ్ళింది. రాత్రి అయిన భార్య, పిల్లలు ఇంటికి రాకపోవడంతో యేసయ్య వారి కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కొల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.