మండలంలోని రాజారo వద్ద అక్రమ రివాల్వర్ కలిగి ఉన్న వ్యక్తిని మంగళవారం మల్యాల పోలీసులు పట్టుకున్నట్లు జగిత్యాల డిఎస్పీ ఎన్. వెంకటస్వామి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఎస్ఐ కుమారస్వామి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది రాజారo బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఒక వ్యక్తి హీరో ఫ్యాషన్ ప్లస్ మోటార్ సైకిల్ పై జగిత్యాల నుండి కరీంనగర్ వైపు వెళ్తూ పోలీసు వారిని చూసి బండితో తిరిగి వెనక్కి వెళ్లే ప్రయత్నంలొ పోలీసులు పట్టుకున్నారు. అయితే అతను అనుమానస్పదంగా కనిపించడంతొ చెక్ చేయగా, ఒక రివాల్వర్ తొ పాటు, 6 బుల్లెట్లు లభించడంతొ వెంటనే అరెస్ట్ చేసి, పూర్తిగా విచారించారు.
ముస్తాబాద్ గ్రామస్తుడైన గూడెం మహేందర్ ఫంక్షన్ హాల్ ను నిర్వహిస్తూ జీవిస్తూన్నడని డిఎస్పీ తెలిపారు. అతనికి రియల్ ఎస్టేట్ వ్యాపారం లావాదేవీల విషయంలో కొంత మందితో వివాదాలు ఉన్నట్లు, వాటిని పరిష్కరించుకొనుటకు ఒక తుపాకీ అవసరం అని భావించి, 2020 నవంబర్ లొ బీహార్ లోని గోపాల్ గంజ్ పట్టణంలొ ఒక పిస్టన్ ని మరియు ఆరు తూటాలను రూపాయలు 50 వేలకు కొనుగోలు చేశాడు. అప్పటినుండి ఆ రివాల్వర్ వెంటపెట్టుకొని తిరుగుతున్నాడు.
ఈ క్రమంలో రాజారం బస్టాండ్ వద్ద మల్యాల పోలీసులు పట్టుకున్నట్టు డిఎస్పి పేర్కొన్నారు. నిందితుడి నుంచి పిస్టల్, ఆరు బుల్లెట్లు, ద్విచక్ర వాహనం మరియు ఒక ఫోన్ ఉండగా, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు అలాగే నిందితుడిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు డిఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలొ సీఐ కోటేశ్వర్, ఎస్ఐ కుమారస్వామి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.