హత్యాచారయత్నం కేసులో వ్యక్తి తో పాటు మహిళ అరెస్ట్..
A man and a woman were arrested in the case of attempted murder.
పని ఇస్తానని చెప్పి యువతిపై అత్యాచారానికి యత్నించిన కేసులో గడ్డం హనుమాన్లు అనే వ్యక్తి తో పాటు రసీదా అనే మహిళను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై శ్యామ్ రాజ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఆరపేటకు చెందిన రసీదా అనే మహిళ వరసకు కూతురు అయిన ఓ యువతికి పని ఇప్పిస్తానంటూ నమ్మించి యువతిని ఆటోలో పట్టణంలోని వెంకట్రావుపేట గుట్ట వద్దకు తీసుకెళ్లింది.అక్కడికి వెళ్ళిన తర్వాత మండలంలోని చౌలమద్ది గ్రామానికి చెందిన గడ్డం హనుమాన్లు అనే వ్యక్తికి ఫోన్ చేసి రప్పించి సదరు యువతికి హనుమాన్లు ను పరిచయం చేసింది.
అతడితో పడుకుంటేనే పని దొరుకుతుందని ఆ యువతికి చెప్పి గడ్డం హనుమాన్లు అనే వ్యక్తికి అప్పగించింది. ఆ యువతిని హనుమాన్లు అనే వ్యక్తి తాను చెప్పినట్టే వినాలని అప్పుడే పని దొరుకుతుందని చేతులతో అసభ్యకరంగా తాకుతూ అత్యాచార యత్నానికి ప్రయత్నించగా. అందుకు యువతి నిరాకరించింది. విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తానంటూ హనుమాన్లు యువతిని బెదిరింపులకు గురి చేశాడు. విషయాన్ని ఆ యువతి తన తల్లి కి తెలుపగా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గడ్డం హనుమాన్లు తో పాటు రసీదా లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ ఐ తెలిపారు.