ఓ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు గురు మరణించారు. మరో పది మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. క్షతగాత్రులు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. పల్నాడు జిల్లాలోని దాచేపల్లి ప్రాంతంలో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన 23 మంది కూలీలు ఆటోలోప్రయాణిస్తున్నారు. వీరంతా గురజాల మండలం పులిపాడుకు వెళ్తున్నారు.
కమలంతో ముందుకా..వెనుకకా.. టీడీపీ, జనసేన ఆచితూచి అడుగులు.
అయితే ఈ సమయంలో ఒక్క సారిగా లారీ వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న కూలీలందరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో పది మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు