ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో 216(ఏ) జాతీయ రహదారిపై కాలువ డ్యామ్ వద్ద హిజ్రాను గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య చేసి పంట కాలువలో విసిరి వేశారు.స్థానికులు తెలియజేసిన వివరాలు ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా మాధవరం మండలం ఉప్పరగూడెం గ్రామానికి చెందిన మరిపట్ల ఆనంద్ (33) అనే వ్యక్తి (హిజ్రాను) గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి తీవ్రంగా గాయపరిచి హత్యచేసి పంట కాలువలో విసిరివేశారు.
ఒక డెడ్ బాడీ.. వంద అనుమానాలు..
ఈ మేరకు శనివారం ఉదయం కొత్తపేట డిఎస్పి కే.వెంకటరమణ, రావులపాలెం సర్కిల్ సీఐ రజిని కుమార్, రావులపాలెం ఎస్సై వెంకటరమణ కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి ఆధారాలు కొరకు వేలిముద్ర నిపుణులను,డాగ్ స్క్వాడ్ బృందాన్ని పిలిపించి స్థానిక ఎస్ఐ ఎస్.శివప్రసాద్ తమ సిబ్బంది సహకారంతో మరిన్ని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.దీనిపై స్థానిక ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.