మేడికొండూరు మండలంలోని పేరేచర్ల కాలనీలో దారుణ హత్య జరిగింది. సత్తెనపల్లికి చెందిన వ్య క్తిని గుర్తు తెలియని దుండగులు గొంతుకోసి హత్య చేశారు. మేడికొండూరు సీఐ వా సు తెలిపిన వివరాలు.. జగనన్న కాలనీ చిన్న కాలవలో 32 ఏళ్ల వ యస్సున్న వ్యక్తి మృతదేహం పడిఉండగా స్థానికులు పోలీసులకు స మాచారం ఇచ్చారు. దీంతో వారు మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని పరిశీలించారు.
అక్కడ లభించిన ఆధారాల ప్రకారం మృతుడు సత్తెనపల్లి లోని శాలివాహన కాలనీకి చెందిన మందా సైదేశ్వరరావు అని పోలీసులు గుర్తించారు. మృతుడి తలపైన రాడ్ కొట్టినట్లు గాయాలున్నాయి. అంతేకాకుండా గొంతుకోసి ఉం ది. మృతదేహం పక్కనే టాటా ఏస్ ఆటో నిలిపి ఉంది. ఆటో సైదేశ్వ రరావు పేరు మీద ఉంది. ఆటో బాడుగ పేరుతో లేదా నమ్మకంగా ఎవరో పథకం ప్రకారం ఇక్కడకు తీసుకువచ్చి సైదేశ్వరరావును హ త్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లను రప్పించి ఆధారాలను పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.