Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మరో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆందోళన నిన్న రెడ్డి శాంతి..ఇవాళ కిరణ్

0

శ్రీకాకుళం జిల్లా అధికార పార్టీలో అసమ్మతి రాగం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. నిన్నటికి నిన్న పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి వద్దు.. జగనన్న ముద్దు అంటూ నల్లబ్యాడ్జీలు ధరించి ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అధికార పార్టీలో ఓ వర్గం ఆందోళనకు దిగింది. ఇది చల్లారక మునుపే ఎప్పటి నుంచో చాపకింద నీరులా ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ పై వ్యతిరేకత ఒక్కసారిగా భగ్గుమంది. ఆ సెగ్మెంటు నుంచి శ్రీకాకుళం నగరం వరకు ఈ గ్రూపుల గోల పాకింది. నగరంలోని పీఎన్ కాలనీకి సమీపంలో గల కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే కిరణ్‌కు వ్యతిరేకంగా అసమ్మతి వాదులు సమావేశం నిర్వహించి.

 

రానున్న ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామంటూ బహిరంగంగానే సవాల్ విసరడం హాట్ టాపిక్ గా మారింది.ఎమ్మెల్యే కిరణ్ కుమార్‌కు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరింది. అప్పటి నుంచి కిరణ్ కు వ్యతిరేకంగా వైసీపీ సీనియర్ నాయకులు బల్లాడ జనార్థన్ రెడ్డి, జరుగుళ్ల శంకర్ తో పాటు మరికొంత మంది గతంలో లావేరులో రహస్య సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేపై తిరుగుబాటు ప్రదర్శించారు. దీనిపై ఆ పార్టీలో ప్రముఖులైన విజయసాయిరెడ్డి, విజయ నగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ రెడ్డి ఓదార్చడంతో కాస్తా సద్దుమణిగిందనుకున్నారు.

 

ఎమ్మెల్యే గొర్లె కిరణ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఓ వర్గం ఆదివారం ఎచ్చెర్ల నుంచి శ్రీకాకుళం నగరం వరకూ భారీ ర్యాలీ చేపట్టింది. వందలాది మంది తరలిరావడంతో ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఏం జరుగుతోందని అందరూ చర్చించుకుంటున్నారు. ఇది ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. నాయకుల మధ్య అంతర్గత పోరుతో నలిగిపోతున్న తరుణంలో ఎమ్మెల్యే ఏకపక్ష ధోరణితో వర్గపోరు తీవ్రమైందని ఓ వర్గం బాహాటంగానే విమర్శిస్తోంది. వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పై కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడ్డారని అదే పార్టీ నేతలు బహిరంగ విమర్శలు దిగుతున్నారని అన్నారు.

 

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సొంత పార్టీ నుంచి అసమ్మతి స్వరాలు వినిపించడంతో ఎమ్మెల్యే వర్గీయులు, సీనియర్ నేతలు కంగుతిన్నారు. వైసీపీ అధిష్టానం కూడా ఎమ్మెల్యే వైఖరిపై ఆగ్రహంతో నియోజకవర్గంలో ఆయన పని తీరుపై సర్వే చేయించిందని టాక్ లేకపోలేదు. అటు పాత పట్నం ఎమ్మెల్యేపై ఎలా ఓవర్గం తిరుగుబాటు చేశారో ఎచ్చె ర్లలో కూడ అదే విధంగా రోడ్డెక్కడంతో ఆయా ఎమ్మెల్యేలలోనే కాకుండా అధికార పార్టీ నేతల్లో కూడ చర్చనీయాంశమైంది. ఇంటా, బయటా అసమ్మతితో ఇబ్బందిపడుతున్న ఎమ్మెల్యేలు, గొర్లె కిరణ్, రెడ్డి శాంతిలకు అభద్రతా భావం మొదలైందని చెప్పక తప్పదు.

ఎన్.యు.జే. (ఐ) జాతీయ ఉపాధ్యక్షుడిగా పురుషోత్తం నారగౌని.

కొంతమంది ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, పార్టీ పదవులలో కొనసాగుతున్న వారే నేరుగా ఢీ కొట్టేందుకు సై అంటున్నారు. ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తుండడంతో రానున్న రోజుల్లో దీని ప్రభావం మరింత తీవ్రతరంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ పై సొంత పార్టీలోనే అసమ్మతి వెల్లువెత్తింది. ఎమ్మెల్యే మాకొద్దంటూ అసమ్మతి నాయకు ఆదివారం రోడ్డెక్కారు. జగన్ ముద్దు.. ఎమ్మెల్యే వద్దంటూ గొర్లె కిరణ్ కి వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ ఎచ్చెర్ల నుంచి శ్రీకాకుళం నగరంలోని పీఎన్ కాలనీలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వరకు హైవే మీదుగా కొనసాగింది.

 

జగన్ రావాలి.. కిరణ్ పోవాలి, జగన్ ముద్దు.. కిరణ్ వద్దు, టిక్కెట్ కిరణ్‌కు వద్దు.. వేరే ఎవరికైనా సై.. అంటూ నినాదాలతో ర్యాలీ సాగింది. ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తూ ప్లకార్డులను అసమ్మతివాదులు పట్టుకుని ర్యాలీలో ముందుకుసాగారు. అవినీతి ఎమ్మెల్యేను రానున్న ఎన్నికల్లో గద్దె దింపుతామని సీనియర్ నాయకులతో పాటు కొందరు సర్పంచ్ లు, ఎంపీటీసీలు హెచ్చరించారు. ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారుఎమ్మెల్యే అయిన తరువాత ఆయన వ్యక్తిగత ప్రయోజనాలకు పాటుపడుతున్నారే తప్ప పార్టీ అభివృద్ధికి శ్రమించడం లేదన్నారు.

 

ఆయన తీరుతో సీఎం జగన్మోహన్ రెడ్డికి మచ్చ మిగులుతుందన్నారు. పార్టీకి నష్టం చేస్తుండడంతో ఇక భరించలేక రోడ్కెక్కామన్నారు. వలంటీర్లను పెడితే అక్కడ కూడ అడ్డుకున్నారని, తన ఇంటి పేరు ఉందని ముగ్గురిని తీసేశారన్నారు. ఈ విషయం మంత్రి సత్తిబాబు దృష్టిలో పెట్టామని తెలిపారు. ఆయన జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోయిందన్నారు. పార్టీని నమ్ముకున్నవారిని కాదంటే ఎట్టి పరిస్థితిలో ఆయన వద్ద ఊడిగం చేయలేమని స్పష్టం చేశారు.ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ను వ్యతిరేకిస్తూ ఎచ్చెర్ల నుంచి శ్రీకాకుళం నగరం వైపు వస్తున్న బైక్ ర్యాలీని ఎచ్చెర్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

దారుణమైన మనస్తత్వం ఉన్న రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం సీఎం జగన్

ఆదివారం నిర్వహించే ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ అక్కడ ఎస్ఐ హైవేపై అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని వైసీపీ సీనియర్ నేతలు బల్లాడ జనార్థన్ రెడ్డి, శంకర్ పోలీసులకు వివరించినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కొందరు బైక్ లపై నగరంలోకి జారుకున్నారు. శ్రీకాకుళం నగరంలో ఎవరూ అడ్డుకోకపోవడంతో పీఎన్ కాలనీ సమీపంలో గల పంక్షన్ హాల్లో ఎమ్మెల్యే కిరణ్ పై తిరుగు బాటు సమావేశం యథావిధిగా నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie