వన మహోద్యమం హరితోత్సవం అని కోదాడ అభివృద్ధి ప్రధాత,శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.సోమవారం అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహించే తెలంగాణ హరితోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,భవిష్యత్ తరాలకు ఆస్తులు పంచడం కన్నా స్వచ్ఛమైన గాలి, నివాస యోగ్యమైన పచ్చని ప్రకృతి పరిసరాలను అందించాలనే సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పం నుంచి పుట్టినదే తెలంగాణకు హరితహారం పథకం అని ఆయన తెలిపారు.
దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతం, నేడు పచ్చని పంటలతో, మైదాన ప్రాంతం నిండుగా దట్టమైన చెట్లతో మూడమూచ్చటగా ఉన్నది. తెలంగాణలో ఈ 9 ఏళ్లలో కోట్ల మొక్కలతో పురి విప్పిన నెమలి వలే తెలంగాణ పచ్చని చెట్లతో నాట్య మాడుతున్నది అని ఆయన అన్నారు.హరితహారంతో ఆకుపచ్చని తెలంగాణ ఆవిష్కృతం కావడం జరిగింది అని ఆయన తెలిపారు.ఎనిమిదేండ్లలో ఆకుపచ్చని అడుగులు వేయడం జరిగింది అని ఆయన తెలిపారు.తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకొనేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలకు అంకురార్పణ చేయడం జరిగింది అని అన్నారు.భవిష్యత్ తరాలకు ఆస్తులు పంచడం కన్నా స్వచ్ఛమైన గాలి, నివాస యోగ్యమైన పచ్చని ప్రకృతి పరిసరాలను అందించాలనే సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పం నుంచి పుట్టినదే తెలంగాణకు హరితహారం పథకం అని ఆయన తెలిపారు.
గర్శకుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని రిలే దీక్ష బీ ఆర్ ఎస్ నాయకుల మద్దతు చొప్పదండి
హరిత వనాల్లో వంద శాతం పచ్చదనం సాధించామని తెలిపారు.మొక్కలు చెట్లుగా మారి ఆక్సిజన్‌తోపాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి అని ఆయన అన్నారు.పచ్చదనం పెంపులో దేశంలోనే అగ్రగామి రాష్ట్రం గా తెలంగాణ .సంకల్పం, ప్రజల భాగస్వామ్యమే పచ్చని విజయానికి సాక్షిగా నిలిచింది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కిషోర్ కుమార్, ఎంపీపీ చండూరు వెంకటేశ్వర్లు, సర్పంచ్ జొన్నగడ్డ శ్రీనివాసరావు, ఎంపీటీసీ గింజపల్లి రమేష్, తాసిల్దార్ సంతోష్ కిరణ్, స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, పారెస్ట్ ఆఫీసర్ లక్ష్మీపతి రావు,ఎంపీడీవో విజయ, బిఆర్ఎస్ నాయకులు బుర్ర పుల్లారెడ్డి, ఈదుల కృష్ణయ్య, వెంపటి మధు, ఆయా గ్రామాల సర్పంచులు వెంకటేశ్వర్లు, భూపతి, లీలావతి బాబు, వెంకటప్పయ్య, ఎంపీటీసీలు నారాయణరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు సంతోష్, రాంప్రసాద్, బిఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.