ప్రకాశం జిల్లా త్రిపురాంతకం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ కు చెందిన నలుగురు మృతి చెందారు.. అనంతపురం నుంచి విజయవాడ వెళుతున్న కారు ఎదురు గా వస్తున్న ఆర్టిసి బస్సును అదుపుతప్పి ఢీకొట్టింది.. ఘటనలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆసుపత్రి కి తరలిస్తుండగా మార్గ మధ్య లో మరొకరు మృతి చెందాడు…మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.. మృతులు విజయవాడకు చెందిన పెళ్లిళ్లకు డెకారేట్ చేసేవారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఆర్టీసి బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు..