Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

2 లక్షల  90 వేల కోట్లతో బడ్జెట్

0

వ్యవసాయరంగానికి పెరిగిన కేటాయింపులు
హైదరాబాద్, ఫిబ్రవరి 6,
తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి గత ఏడాది కన్నా దాదాపుగా రూ. 35 వేల కోట్లు ఎక్కువగా బడ్జెట్ ప్రతిపాదించింది. గత ఏడాది  2,56,958.51  కోట్లు పద్దులను హరీష్ రావు సభలో ప్రవేశ పెట్టారు. ఈ ఏడాది ఆ మొత్తం రూ.2,90,396 కోట్లకు చేరింది. దానికి తగ్గట్లుగానే కేటాయింపులు సంక్షేమ పథకాలు భారీగా పెంచారు. నిధుల్లో అత్యధికంగా ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు కేటాయిచారు. అయితే ఇందులో దళిత బంధు పథకం నిధుల్లేవు. దళిత  బంధు కోసం ప్రత్యేకంగా రూ. 17,700 కోట్లు కేటాయించారు. ప్రతీ నియోజవర్గంలో పదకొండు వందల మందికి దళిత బంధు ఇవ్వాలని నిర్ణయించారు.  .

గత ఏడాది కన్నా భారీగా పెరిగిన కేటాయింపులు
వ్యవ‌సాయ రంగానికి గత ఏడాది రూ. 24,254 కోట్లు కేటాయించారు. ఈసారి  వ్యవసాయానికి రూ. 26,831 కోట్లు ఇచ్చారు.  ఆసరా ఫించన్ల కోసం రూ. 12,000 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఆస‌రా పెన్షన్ల‌కు రూ. 11,728 కోట్లు కేటాయించారు.  , ఎస్టీ ప్రత్యేక నిధి కోసం ఈ ఏడాది రూ.15, 233 కోట్లు కేటాయింగా.. గత ఏడాది ఈ మొత్తం  రూ. 12,565 కోట్లు మాత్రమే ,  బీసీ సంక్షేమం కోసం రూ. 6, 229 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ మొత్తం రూ. 5,698 కోట్లు. విద్య కోసం రూ.19, 093 కోట్లు.  వైద్యం కోసం రూ.12,161 కోట్లు కేటాయించారు. డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లకు రూ.12వేల కోట్లు, నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు కేటాయించారు. రుణమాఫీకి కూడా రూ ఆరు వేల కోట్ల వరకూ కేటాయించారు.

ఆదాయ అంచనాలు చాలా ఎక్కువ !
ఈ ఏడాది ఆదాయ అంచనాలను ప్రభుత్వం ఎక్కువగా వేసుకుంది. కేంద్ర నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నులు కాకుండా రూ.41 వేల కోట్లకుపైగా వస్తాయని బడ్జెట్‌లో పేర్కొన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నుంచి 18 వేల కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా 39, 500 కోట్లు వస్తాయన్నారు.దాదాపుగా ఇరవై వేల కోట్లు మద్యం అమ్మకాల ద్వారా వస్తాయని చెప్పారు. అయితే ఈ ఆదాయ అంచనాలే ఎక్కువ అయితే.. ఆదాయానికి ఖర్చునకు పొంతన లేకుండా బడ్జెట్ లెక్కలు ఉన్నాయన్న విమర్శలు ఇతర నేతల దగ్గరనుంచి వస్తున్నాయి. గత ఏడాది బడ్జెట్‌లో ఇలాంటి లెక్కలే వేసినా ఇంత వరకూ చాలా వాటికి కేటాయించిన నిధులు విడుదల చేయలేదన్న ఆరోపణల ుఉన్నాయి. సంక్షేమ రంగానికి ఈ ఏాడది గతం  కంటే ఎక్కువగా నిధులు విడుదల కేటాయించారు. కానీ ఆదాయం ఎక్కడి నుంచి అనేదానిపై స్పష్టత లేదు.దీంతో విపక్షాలు సహజంగానే విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇదంతా అంకెల గారడీనేనని..  గత ఏడాది బడ్జెట్ ఎంత.. ఎంత ఖర్చుపెట్టారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. కేటాయింపుల పరంగా చూస్తే.. ఈ బడ్జెట్ ప్రజాకర్షక బడ్జెట్ అనుకోవచ్చు. కానీ ఖర్చు చేయడంపైనే అసలు బడ్జెట్ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఈ బడ్జెట్ మొత్తం కాలం అధికారంలో ఉండదు.. నాలుగు నెలల ముందుగానే ప్రభుత్వం మారిపోతుంది. మళ్లీ బీఆర్ఎస్ వస్తే ఇదే పద్దులు కొనసాగుతాయి. లేకపోతే తదుపరి ప్రభుత్వం ప్రయారిటీలు మార్చుకోవచ్చు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie