Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

లండన్‌లో తెలంగాణ యువతి దారుణ హత్య

0

ఉన్నత చదువుల కోసం లండన్‌లో ఉంటున్న రంగగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువతిని బ్రెజిల్‌ యువకుడు చంపేశాడు. బ్రాహ్మణపల్లికి చెందిన  27 ఏళ్ల తేజస్విని రెడ్డి లండన్‌లో ఎంఎస్‌ చేస్తున్నారు. మిత్రులతో కలిసి ఉంటున్నారు. ఆమెపై రాత్రి బ్రెజిల్‌కు చెందిన యువకుడు కత్తితో దాడి చేశాడు. ఆమెతోపాటు ఫ్రెండ్‌పై కూడా నిందితుడు అటాక్ చేశాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బ్రాహ్మణపల్లికి చెందిన తేజస్విని.. లండన్‌లో ఎమ్మెస్‌ చదువుతోంది. తండ్రి అనారోగ్యం కారణంగా ఆరునెలల క్రితమే ఇంటికి వచ్చి తిరిగి వెళ్లిపోయింది.

 

అంతలోనే తేజస్విని మరణవార్త వినాల్సి వస్తుందని ఊహించలేదంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరో రెండు నెలల్లో కోర్సు పూర్తి చేసుకుని ఇంటికి రావాల్సి ఉన్న తమ బిడ్డ ఇక లేదనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తేజస్పిని కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.తేజస్వినికి సంబంధాలు కూడా చూస్తున్నారు కుటుంబసభ్యులు. అంతలోనే దారుణం జరిగిపోయిందంటూ గుండెలు బాదుకుంటున్నారు. దీంతో బ్రహ్మణపల్లిలో విషాదం చోటుచేసుకుంది.ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలపాలైన తేజస్విని చనిపోయారు. ఆమె స్నేహితురాలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు నెలల క్రితమే తేజస్విని లండన్ వేళ్లారు.

నేను దోషిని కాదు.. ట్రంప్ అరెస్ట్ విడుదల..

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie