నిర్భయ తరహా ఘటన: 12యేళ్ల బాలికపై అత్యాచారం
12-year-old girl was raped in UP
- నిర్భయ తరహా ఘటన
- పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
- ‘బుల్డోజర్’తో ఇళ్లు నేలమట్టం
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ సాత్నా లో 12యేళ్ల బాలికపై ఇద్దరు దుండుగులు అత్యాచారానికి పాల్పడిన ఘటన శనివారం వెలుగుచూసింది. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇద్దరు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. అటు ప్రభుత్వం నిందితుల ఇళ్లను ‘బుల్డోజర్’తో కూల్చి వేసింది. ఈ నేపథ్యంలో స్థానికంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
పోలీసుల కథనం మేరకు..
రవిచౌదరి, అతుల్ బదోలియాలు బాలికపై నిర్భయ తరహా అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు స్పష్టం చేశారు. బాలిక శరీరంపై అనేక గాయాలున్నాయన్నారు. నిందితులు బాలికను తీవ్రంగా హింసించారన్నారు. గురువారం నిందితులు బాలికకు మాయమాటలు చెప్పి కొండప్రాంతానికి తీసుకువెళ్లారన్నారు. అనంతరం అత్యంత దారుణంగా హింసిస్తూ అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. ఈ ఘటన విషయాన్ని కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో నిందితులిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.
సీఎం శివరాజ్సింగ్చౌహాన్..
బాలికపై అత్యాచారం అత్యంత హేయనీయమని సీఎం శివరాజ్సింగ్చౌహాన్ అన్నారు. ఇందుకు బాధ్యులైన నిందితులను వదిలే ప్రసక్తే లేదన్నారు. అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. మరోవైపు బాలికను మెరుగైన చికిత్సనందించాలని వైద్యులకు సూచించారు. కాగా నిందితుల ఇళ్లను అధికార యంత్రాంగం కూలుస్తుండగా కుటుంబ సభ్యులు, పలువురు స్థానిక నేతలు అడ్డుపడ్డారు. వారు చేసిన పనికి కుటుంబం మొత్తాన్ని బాధ్యులను చేయడం, వారిని నిరాశ్రయులను చేయడం సరికాదన్నారు. వారిని శిక్షించాలన్నారు. పోలీసు యంత్రాంగం వీరందరినీ అడ్డుకోగా, మున్సిపల్ యంత్రాంగం నిందితుల ఇళ్లను కూల్చివేసింది.
కాంగ్రెస్నేత, మాజీ సీఎం కమల్నాథ్..
బాలికపై అత్యాచారాన్ని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం కమల్నాథ్ తీవ్రంగా ఖండించారు. మధ్యప్రదేశ్ప్రభుత్వం మహిళలకు, బాలికలకు, అమ్మాయిలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమవుతోందని ఆరోపించారు. దుండగులను కఠినంగా శిక్షించాలని కమల్నాథ్ డిమాండ్ చేశారు.