టీటీడీ బోర్డు ఎక్స్-అఫీషియో సభ్యుడిగా దేవాదాయ శాఖ కమిషనర్ ప్రమాణ స్వీకారం తిరుమల:టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ జెఈవో వీరబ్రహ్మం వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.
రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. సత్యనారాయణకు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను జెఈవో అందించారు.ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబు, బోర్డు సెల్ డెప్యూటీ ఈవో కస్తూరి బాయి, ఆలయ పేష్కార్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.