ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ పోస్టర్లు.. వైసీపీ ఎమ్మెల్యే పద్మావతి స్పందన

వైసీపీ శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కనిపించడం లేదని ఆమె నియోజకవర్గంలో పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పద్మావతి స్పందిస్తూ… తాను రెండు రోజులు కనిపించకపోతేనే తన నియోజకవర్గంలోని గుంజేపల్లి ప్రజలు తనను మిస్ అవుతున్నట్టు ఫీలవుతున్నారని సెటైర్ వేశారు.

ఈ నెల 16న తన భర్త సాంబశివారెడ్డికి కరోనా సోకిందని, అందువల్ల తామంతా క్వారంటైన్ లో ఉన్నామని పద్మావతి తెలిపారు. కరోనా వచ్చినా పర్వాలేదు, తనను కలవాలనుకుంటే గుంజేపల్లి గ్రామస్థులు తన ఇంటికి రావచ్చని అన్నారు. గుంజేపల్లిలోని కొందరు కులాన్ని పట్టుకుని వేలాడుతున్నారని, ఎవరి కులం వారికి గొప్పదని చెప్పారు. తాను కనిపించడం లేదని పోస్టర్లు పెట్టిన వారి అంతరంగం ఏమిటో తనకు అర్థం కావడం లేదని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.